ఇబ్బందుల్లో ఇండస్ ​బ్యాంక్ .. డెరివేటివ్​ పోర్ట్​ ఫోలియోలో తప్పిదాలు

ఇబ్బందుల్లో ఇండస్ ​బ్యాంక్ .. డెరివేటివ్​ పోర్ట్​ ఫోలియోలో తప్పిదాలు
  • డెరివేటివ్​ పోర్ట్​ ఫోలియోలో తప్పిదాలు
  • నెట్​వర్త్​ రూ.2,100 కోట్లు తగ్గే అవకాశం
  • ఇన్వెస్టర్లకు రూ.14 వేల కోట్ల లాస్​

న్యూఢిల్లీ: డెరివేటివ్​ పోర్ట్​ఫోలియోలో లోపాలు ఉన్నట్టు తేలడంతో ఇండస్ఇండ్​ ​బ్యాంకు షేర్లు భారీగా పడ్డాయి. ఈ తప్పిదం వల్ల బ్యాంకుకు రూ.2,100 కోట్ల వరకు నష్టం వస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో భయాలను పెంచాయి. దీంతో షేర్లు మంగళవారం 27 శాతానికిపైగా నష్టపోయి 52 వారాల కనిష్టానికి చేరాయి. ఎన్​ఎస్​ఈలో స్టాక్​ 27.06 శాతం నష్టంతో రూ.656.80వద్ద ముగిసింది.   దీంతో ఇన్వెస్టర్లు రూ.27 వేల కోట్లు నష్టపోయారు. తమ డెరివేటివ్​ పోర్ట్​ఫోలియో ఖాతాల్లో అవతవకలు ఉన్నాయని, గతంలో జరిగిన ఫారెక్స్​ ట్రాన్సాక్షన్ల ఖర్చులను బ్యాంకు తప్పుగా అంచనా వేయడం వల్లే ఇలా జరిగిందని సంస్థ తెలిపింది.  

ముంబైకి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంటర్నల్​ రివ్యూ .. గత డిసెంబర్ నాటికి నెట్​వర్త్​లో దాదాపు 2.35 శాతం తగ్గవచ్చని వెల్లడించింది. బ్యాంకు షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 42 శాతం తగ్గాయి. షేర్ల పతనం వల్ల మ్యూచువల్ ​ఫండ్​ కంపెనీలు మంగళవారం ఒక్క రోజే రూ.6,900 కోట్లు నష్టపోయాయి.  ఈ విషయమై ఇండస్ఇండ్ వివరణ ఇస్తూ ఆడిటర్ ఈ విషయాన్ని సమీక్షిస్తున్నారని, ఈ నెల చివరి నాటికి రిపోర్ట్​ వస్తుందని తెలిపింది. గత ఏడాది సెప్టెంబరు–అక్టోబరు మధ్య కాలంలో అకౌంటింగ్​ లోపాలను గుర్తించామని ఇండస్​ఇండ్ ​బ్యాంక్​ సీఈఓ, ఎండీ సమంత్ ​కత్పాలియా చెప్పారు. దీనిపై ఆర్​బీఐకి గత వారమే సమాచారం ఇచ్చామని వెల్లడించారు.  

ఆర్​బీఐ కూడా  ఈ వ్యవహారంపై కన్నేసింది. ప్రస్తుత సీఈఓ పదవీకాలాన్ని మూడేళ్లకు బదులు ఏడాదికి మాత్రమే పొడిగించాలని నిర్ణయింది. ఈ పరిణామాలతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు ఇంటర్నల్ కంట్రల్స్​ బలహీనంగా ఉన్నాయని, పాలనాపరమైన సమస్యలూ ఉన్నాయని ఎనలిస్టులు అంటున్నారు. దీనిపై బ్యాంక్ ​చైర్మన్​ అశోక్ ​హిందుజా స్పందిస్తూ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుందని, అవసరమైతే మరింత డబ్బు ఇన్వెస్ట్​ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అప్రూవల్​వచ్చాక బ్యాంకులో వాటాలను పెంచుకుంటామని అన్నారు.