రైతులకు నష్ట పరిహార చెక్కుల పంపిణీ

రైతులకు నష్ట పరిహార చెక్కుల పంపిణీ

కొడంగల్/వికారాబాద్, వెలుగు: ఇండస్ట్రియల్​కారిడార్​కోసం భూములు కోల్పోతున్న దుద్యాల మండలం హకీంపేట రైతులకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్​జైన్ సోమవారం నష్టపరిహారం చెక్కులను అందజేశారు. కలెక్టరేట్​లో జరిగిన కార్యక్రమంలో ఎకరాకు రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందన్నారు. 

హకీంపేటలో మొత్తం 93.16 ఎకరాల భూమిని 62 మంది రైతుల నుంచి సేకరించినట్లు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్​కలెక్టర్​ఉమాశంకర్​ప్రసాద్, అడిషనల్​కలెక్టర్ లింగ్యా నాయక్,  టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శారదా, అసిస్టెంట్ మేనేజర్ అజీమా సుల్తానా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, తహసీల్దార్​ కిషన్​ ఉన్నారు.