వికారాబాద్​ జిల్లాలో ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ కారిడార్‌‌‌‌‌‌‌‌ భూసర్వే

వికారాబాద్​ జిల్లాలో ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ కారిడార్‌‌‌‌‌‌‌‌ భూసర్వే

కొడంగల్, వెలుగు : వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ కారిడార్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు కోసం భూ సర్వే స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అయింది. ఇందులో భాగంగా సోమవారం దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో నాలుగు టీమ్స్‌‌‌‌‌‌‌‌ సర్వేను మొదలు పెట్టాయి. రైతుల అంగీకారంతో సర్వే నిర్వహిస్తున్నట్లు దుద్యాల తహసీల్దార్​కిషన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. మొత్తం 1,234 ఎకరాల్లో ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్​ఏర్పాటు చేస్తోందన్నారు. ఇందుకోసం పోలేపల్లిలో 130 ఎకరాలు, హకీంపేటలో 497 ఎకరాలు, లగచర్లలో 607 ఎకరాలు సేకరించనున్నట్లు చెప్పారు. భూసేకరణకు సంబంధించి ఇప్పటికే గెజిట్​నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ అయిందన్నారు. ఇటీవల జరిగిన లగచర్ల ఘటన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు.