
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాలను తగ్గించడానికి గీతం యూనివర్సిటీ కెరీర్ గైడెన్స్సెంటర్ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఇండస్ట్రియల్ కాంక్లేవ్2.0 విజయవంతమైంది. వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులు, సీఈవోలు ఈ కాంక్లేవ్ ద్వారా యువ పరిశ్రమ నిపుణులకు, స్టూడెంట్స్కు అవగాహన కల్పించారు. ఆర్డినెన్స్ఫ్యాక్టరీ ఉన్నతాధికారి విజయదత్, ఎట్ నెస్ట్ఆపరేషన్స్ఆఫీసర్సీహెచ్నెహ్రూ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా పరిశ్రమల నిపుణులతో జరిగిన ప్యానల్చర్చలలో భాగంగా ఆటోమేషన్టూ ఆగ్మెంటేషన్, మానవ కేంద్రీకృత వ్యూహాలు, ఆర్టిఫిషియల్ఇంటలిజెన్స్తదితర అంశాలపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ.. వేగంగా మారుతన్న టెక్నాలజీ ప్రపంచంలో సందర్భోచితంగా మన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీసీ డీఎస్రావు, స్కూల్ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్రామశాస్త్రి, సీజీసీ డైరెక్టర్మమత, వివిధ బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, పరిశోధకులు పాల్గొన్నారు.