ఇండస్ట్రియల్ ​కాన్‌‌క్లేవ్‌‌ నిర్వహించిన బీఎన్ఐ

ఇండస్ట్రియల్ ​కాన్‌‌క్లేవ్‌‌ నిర్వహించిన బీఎన్ఐ

హైదరాబాద్, వెలుగు: బిజినెస్​ నెట్​వర్కింగ్ ​ఇంటర్నేషనల్​( బీఎన్ఐ) గ్రాండ్  హైదరాబాద్​లోని చర్లపల్లి పారిశ్రామిక సంఘం హాల్​లో 'గ్రాండ్ ఇండస్ట్రియల్​ కాన్​క్లేవ్​’ నిర్వహించింది. ఈ కాన్‌‌క్లేవ్‌‌లో ‘ఎంట్రప్రెన్యూర్‌‌షిప్ 2.0 – చాలెంజెస్, ఆపర్చ్యునిటీస్ వే అహెడ్’ అనే అంశంపై ప్యానల్ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) రంగంలో వ్యాపార వృద్ధి, వ్యూహాలపై దృష్టి సారించారు. అనంతరం బీఎన్ఐ గ్రాండ్ చాప్టర్‌‌కు చెందిన 108 మంది సభ్యులు ఎక్స్‌‌పో నిర్వహించారు. ఈ ఎక్స్‌‌పోలో ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు.

టెక్నాలజీకి సంబంధించిన క్లౌడ్ సేవలు, హెచ్ఆర్ సాఫ్ట్‌‌వేర్లు, కంప్యూటర్లు, యాక్సెసరీస్,  కార్పొరేట్ వీడియోగ్రఫీ, మానవ వనరుల సేవలు, అకౌంటింగ్ సాఫ్ట్‌‌వేర్ వంటి ప్రొఫెషనల్ సేవలు, రియల్ ఎస్టేట్, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌కు సంబంధించిన విల్లాలు, ప్రీఫ్యాబ్ సొల్యూషన్లు, ఎలివేటర్లు, డ్రై మిక్స్ ఉత్పత్తులు, జనరేటర్లు, ఫర్నిచర్, కార్పొరేట్ గిఫ్ట్‌‌లు , కరెన్సీ ఎక్స్చేంజ్, ఇన్సూరెన్స్, ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్‌‌మెంట్, డెంటల్ సేవల్లో ఆఫర్ల గురించి వివరించారు.