మేనేజర్ ఉద్యోగాలు.. పోస్టులు తక్కువ ఉన్నయ్.. మార్చి 20 లోపు అప్లై చేసుకోండి..

మేనేజర్ ఉద్యోగాలు.. పోస్టులు తక్కువ ఉన్నయ్.. మార్చి 20 లోపు అప్లై చేసుకోండి..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్​పోస్టుల భర్తీకి ఢిల్లీలోని ఇండియన్​ఫైనాన్స్​కార్పొరేషన్​లిమిటెడ్ నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు 11: మేనేజర్​(ఫైనాన్స్) 5, అడిషనల్ జనరల్ మేనేజర్​(ఫైనాన్స్) 2, పబ్లిక్​ రిలేషన్​ ఆఫీసర్​01, మేనేజర్​(ఐటీ) 01, అడిషనల్​ జనరల్​ మేనేజర్​(ఫైనాన్స్​ ఇంటర్నల్​ఆడిట్) 01, గ్రూప్​ జనరల్​ మేనేజర్​ 1. 

ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(కంప్యూటర్​ సైన్స్, ఐటీ, ఎంసీఏ, ఎంబీఏ), సీఏ, సీఎంఏ, డిగ్రీ(కామర్స్), పీజీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

అప్లికేషన్: ఆఫ్​లైన్ ​ద్వారా. జీఎం/ హెచ్ఆర్ అండ్​ అడ్మిన్, ఇండియన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, యూజీ ఫ్లోర్, ఈస్ట్​ టవర్, ఎన్​బీసీసీ, భీష్మ్​ పితామహ్​ మార్గ్, లోది రోడ్, ప్రగతి విహార్, న్యూఢిల్లీ. 

సెలెక్షన్​ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.