సిద్దిపేట్ లో ఇండస్ట్రీయల్‌ పార్క్

విద్యా, వైద్య రంగాల్లో ముందున్న సిద్ది పేట అడుగులు పారిశ్రామిక అభివృద్ధి వైపు వేగంగా పడుతున్నాయి. ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నస్థానిక యువతలో ఇండస్ట్రీయల్‌‌‌‌ పార్క్ ఏర్పాటుతో ఆశలు చిగురిస్తున్నాయి. పట్టణ శివారులోని మందపల్లి వద్ద 300 ఎకరాల్లో ఇండస్ట్రీయల్‌‌‌‌ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది . తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ(టీఎస్‌ ఐఐసీ) ఆధ్వర్యం లో ఇందు కోసం భూమి సేకరించారు.సిద్దిపేట్ అర్బన్‌‌‌‌ మండల పరిధిలోని మందపల్లి, మిట్టపల్లి, నంగునూరు మండలం ముండ్రాయి, రాజగోపాలపేట గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూముల్లోఇండస్ట్రీయల్‌‌‌‌ పార్క్‌‌ ఏర్పాటు చేస్తున్నారు. సేకరించిన భూమిలో మలేషియాకు చెందిన డీఎక్స్‌‌ఎన్‌‌‌‌ కంపెనీకి46 ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమిలోమరో 70 పరిశ్రమల ఏర్పాటుకు ప్లాన్‌‌ చేశారు. చిన్న,మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కు అనుగుణంగాఇందు లో స్థలాలను కేటాయించనున్నారు. సమీపంలోరంగనాయకసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ నిర్మిస్తుండడం ఇండస్ట్రీయల్‌‌‌‌ పార్క్‌‌కు సాను కూలంశంగా మారింది.

స్థలాల కేటాయింపు ఇలా
ఇండస్ట్రీయల్‌‌ పార్క్‌‌లో పరిశ్రమల ఏర్పాటు పై అధికారులు విధి విధానాలు సిద్ధం చేశారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి వచ్చే దరఖాస్తులను జిల్లా ఇండస్ట్రీయల్‌‌‌‌ ప్రమోషన్‌‌‌‌ కమిటీ, స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌ అసెస్మెంట్‌‌‌‌ కమిటీ పరిశీలించి ఆమోదిస్తాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో కంపెనీలు పెట్టుబడిలో పది శాతం ఈఎండీ కట్టాల్సి వుంటుంది . పరిశ్రమ ఏర్పాటు కుఆమోదం లభించకపోతే ఈ పది శాతం ఈఎండీనితిరిగి వెనక్కి ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు ఈఎండీ నుంచి మినహాయించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు ఒక శాతం ప్రాసెసింగ్‌ ఫీజు కట్టాల్సి ఉంటుంది .

పూర్తి స్థాయిలో అభివృద్ధికి ప్లాన్‌
ఇండస్ట్రీయల్‌‌‌‌ పార్క్ లేఅవుట్‌‌‌‌ను సిద్ధం చేసిన అధికారులు దీని పూర్తి స్థాయి అభివృద్ధికి ప్లాన్‌‌ రెడీ చేస్తున్నారు. హుస్నాబాద్‌ రోడ్డులోని ముండ్రాయి, నర్సాపూర్‌‌‌‌ గ్రామం నుంచి, మందపల్లి వద్ద రాజీవ్‌ రహదారి నుంచి వంద ఫీట్లతో రోడ్డు వేస్తున్నారు. పార్క్‌‌లోకూడా అంతర్గతంగా విశాలమైన రోడ్లు ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంచేందుకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటనున్నారు.

డీఎక్స్‌‌ఎన్‌ పనులు ప్రారంభం
మలేషియన్‌‌‌‌ కంపెనీ డీఎక్స్ఎన్‌‌‌‌ ఇండస్ట్రీయల్‌‌‌‌ పార్క్‌‌లోదాదాపు 175 కోట్ల వ్యయంతో వ్యవసాయ ఆధారితపరిశ్రమ ఏర్పాటు చేయనుంది . ఈ ఒక్క పరిశ్రమఏర్పాటు తో 1500 మంది కి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. హెల్త్ సప్లిమెంట్‌‌ మెడిసిన్స్‌‌ ఉత్పత్తి లో అంతర్జా తీయంగా పేరున్న డీఎక్స్‌‌ఎన్‌‌‌‌ కంపెనీ భారత్‌ లోతన నాలుగో బ్రాంచ్‌ ఏర్పాటు చేస్తోంది.

కాలుష్య రహిత పరిశ్రమలకే పెద్ద పీట
కాలుష్య రహిత పరిశ్రమలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పట్టణ పరిసరాల్లో కాలుష్యానికి కారణమవుతున్న రైస్‌, పార్‌‌‌‌, రా రైస్‌ మిల్లులను ఇక్కడికి తరలించనున్నారు. దాదాపు 35 రైస్‌ మిల్లులకు ఇక్కడ స్థలాలు కేటాయించేందుకు అధికారులు ఆమోదించారు. ఒక్కో రైస్‌ మిల్లుకు ఎకరం నుంచి నాలుగెకరాల వరకు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆటోమొబైల్‌‌‌‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్లాన్‌‌ చేస్తున్నారు. స్టార్టప్‌ కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. అయితే మరో రెండు వందల ఎకరాల భూమిని సేకరించి ఇండస్ట్రీయల్‌‌ పార్క్‌‌ను విస్తరించాలని అధికారులుయోచిస్తున్నారు. ప్రస్తుతం సేకరించిన భూమిలో పూర్తిస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు అగ్రిమెంట్లు పూర్తికాగానే విస్తరణపై దృష్టి సారించనున్నారు. వేల మందికి ఉపాధి ఇండస్ట్రీయల్‌‌‌‌ పార్క్‌‌ ఏర్పాటుతో వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రీయల్‌‌ పార్క్‌‌లో పూర్తి స్థాయిలో పరిశ్రమల స్థాపనజరిగితే సిద్దిపేట ప్రాంత యువత ఉపాధి కోసం ఇరతప్రాంతాలకు వెళ్లే అవసరం ఏర్పడదు.

మూడు నెలల్లోపూర్తి స్థాయిలో సిద్దం
ఇండస్ట్రీయల్‌ పార్క్ వచ్చే మూడు నెలల్లో సిద్ధం చేస్తాం. ఔత్సాహిక పారశ్రామికవేత్తల దరఖాస్తులను స్వీకరించి జిల్లా, రాష్ట్ర కమిటీల ఆమోదంతో పరిశ్రమలకుస్థలాలను కేటాయిస్తాం. ఇండస్ట్రీయల్‌పార్క్‌‌లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. లే అవుట్ ప్లాన్‌ పూర్తి చేశాం. దీనికి అనుమతి లభించగానే రోడ్లు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తాం.

-శివప్రసాద్‌, టీఎస్‌ఐఐసీ జిల్లా మేనేజర్‌‌‌‌ వికారాబాద్‍