ఆగస్టులో తగ్గిన ఇండస్ట్రీల ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌

ఆగస్టులో తగ్గిన ఇండస్ట్రీల ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలోని పరిశ్రమల ఉత్పాదకత ఈ ఏడాది ఆగస్టులో తగ్గింది.  ఇండెక్స్  ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) రెండేళ్ల తర్వాత మొదటిసారిగా నెగెటివ్‌‌‌‌‌‌‌‌లో నమోదైంది.  ఈ ఏడాది జులైలో 4.7 శాతం గ్రోత్ నమోదు కాగా, ఆగస్టులో మాత్రం ఐఐపీ మైనస్ 0.1 శాతానికి పడింది. మైనింగ్‌‌‌‌‌‌‌‌, కరెంట్ ఉత్పత్తి పడిపోవడమే ఇందుకు కారణం. కిందటేడాది ఆగస్టులో ఐఐపీ 10.9 శాతం గ్రోత్ నమోదు చేసింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ – ఆగస్టు మధ్య  ఐఐపీ 4.2 శాతం వృద్ధి చెందగా, కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో 6.2 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో  మైనింగ్, తయారీ,  ఎలక్ట్రిసిటీ రంగాల్లో ఉత్తాదకత పడిపోయిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఓ)  పేర్కొంది. వర్షాల వలన మైనింగ్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌  పడిపోయిందని తెలిపింది.