6 నెలల కనిష్టానికి ఫ్యాక్టరీల ప్రొడక్షన్‌‌‌‌

6 నెలల కనిష్టానికి ఫ్యాక్టరీల ప్రొడక్షన్‌‌‌‌

ఈ ఏడాది ఫిబ్రవరిలో  ఇండస్ట్రీల ప్రొడక్షన్‌‌‌‌ గ్రోత్ ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. కేవలం 2.9 శాతమే పెరిగింది.  తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల బలహీన పనితీరు కారణంగా ప్రొడక్షన్ తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. ఫ్యాక్టరీల ఉత్పత్తిని కొలిచే  ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) కిందటేడాది ఫిబ్రవరిలో 5.6 శాతంగా నమోదైంది. ఈ ఏడాది జనవరిలో 5.2 శాతంగా ఉంది.  

తయారీ రంగంలో ప్రొడక్షన్‌‌‌‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.9 శాతం పెరిగింది.  కిందటేడాది ఫిబ్రవరిలో నమోదైన 4.9 శాతం వృద్ధి రేటుతో  పోలిస్తే తగ్గింది. మైనింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్ గ్రోత్‌‌‌‌ 8.1 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. విద్యుత్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో  ఉత్పత్తి కూడా నెమ్మదించింది. గ్రోత్ రేట్‌‌‌‌ 7.6 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గింది.