పరిశ్రమకోసం ఇస్తే… ప్లాట్లు చేసి అమ్మేశారు

ఆదిలాబాద్ పట్టణంలో రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వభూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, దాన్ని ప్లాట్లుగా మార్చి అమ్ముకోవడంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ వ్యవహారం మీద సీబీఐ ఎంక్వైరీ ఎందుకు చేయించకూడదని అధికారులను ప్రశ్నించింది. పట్టణానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ భూబాగోతం మీద పిల్‌ వేయగా, ఉన్నతాధికారులకు హైకోర్టు బిఫోర్ అడ్మిషన్ షోకాజ్ నోటీసులుజారీ చేసింది.

ఇండస్ట్రీ ఏర్పాటు చేసేందుకు స్థలం ఇవ్వాలని బచ్ రాజ్ అనే వ్యాపారి 1937లో అప్పటి ఆదిలాబాద్ తహసీల్దా ర్ ను కోరారు. అక్కడ ఆయిల్, ఫ్లోర్ మిల్ పెడతానని పేర్కొన్నాడు. తహసీల్దారు ఈ ఫైల్‌ను అసిఫాబాద్‌ కలెక్టర్ కు పంపారు. అప్పట్లో జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ లో ఉండేది. అప్పటి కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ ఆదిలాబాద్ లోని సర్వే నెంబర్ 1లో ఉన్న 15 ఎకరాల భూమిని ఆ వ్యాపారికి కేటాయించారు. ఒకటి రెండు పరిశ్రమలు పెట్టగా, అవి కూడా సరిగా నడవలేదు. ఇండస్ట్రీ నడవకపోవడంతో అందులోని 10 ఎకరాల 10 గుంటల భూమిని మున్సిపాలిటీ అప్పట్లోనే వాపసు తీసుకుంది. వ్యాపారి దగ్గర మిగిలిన నా లుగెకరాల 30 గుంటల భూమిని కూడా పరిశ్రమ నడిపించేందుకే వాడాలని సూచించారు. కానీ ఆ వ్యాపారి భూమిని అమ్మడం ప్రారంభించారు. పేదలకు ఇండ్లస్థలాలు ఇవ్వకుండా ఓ వ్యాపారికి ఖరీదైన భూమి ఎలా ఇస్తారంటూ1980లోనే పూరిగుడి సెల యజమానుల సంఘం కలెక్టర్ కు ఫిర్యాదుచేసింది. దీని మీద విచారణ జరిగింది. ఈ భూమికి సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్లను చేయకూడదని కలెక్టర్‌ రిజిస్ట్రార్ ఆఫీస్ కు లేఖ రాశారు. అయినా తరుచూ రిజిస్ర్టేషన్ లు జరుగుతూ వచ్చినట్లు సామాజిక కార్యకర్త వేసిన పిల్‌లో పేర్కొన్నారు.

అధికారులకు నోటీసులు
సర్వే నెంబర్1లోని భూమిని ఇతరుల పేర్లమీద రిజిస్ట్రేషన్ జరిగిందన్న ఫిర్యాదు మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులకు హైకోర్టు బిఫోర్ అడ్మిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెవెన్యూ, మున్ సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలకు, లాండ్ అండ్ రె వెన్యూ కమిషనర్ , ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్, డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్, ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్‌ జాయింట్ సబ్ రిజిస్ర్టార్, భూమి చేతులు మారిన మూడు కుటుంబాలకు హైకోర్టు నోటీసులు పంపింది.

ఆర్డీవో సమాచారమే..
ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను ఆర్డీవో ద్వారా సమీకరించినట్టు పిల్‌ వేసిన కార్యకర్త తన ఫిర్యాదులో పేర్కొన్నారు . ఇండస్ట్రీ కోసం ఇచ్చిన ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేయించి నట్లు తెలుస్తోంది. పరిశ్రమ కోసం భుక్తాపూర్ లోని సర్వే నెంబర్ 1లో భూమి ఇచ్చారు . ఈ భూమి అమ్మకాలు ని లిపివేయడంతో ఆదిలాబాద్ సర్వే నెంబర్ 1 ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ సర్వే నెంబర్ 1 లోఉన్న భూమి రైల్వే శాఖకు చెందింది. దీంతో రైల్వేశాఖ భూమినే రిజిస్ట్రేషన్‌ చేశారా అన్న అందేహాలున్నాయి . ఈ మొత్తం వ్యవహారంలో కొందరు అధికారుల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లోతుగా పరిశీలిస్తున్నాం
హైకోర్టు అడిగిన అంశాలపై లోతుగా పరిశీలన జరుగుతోంది. ఈ బాధ్యతను ఆదిలాబాద్ తహసీల్దార్ కు అప్పజెప్పాం. ఈ వ్యవహారంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీంచిన తర్వాత కోర్టుకు తెలియజేస్తాం.
– సంధ్యారాణి, జాయింట్ కలెక్టర్, ఆదిలాబాద్