* హైదరాబాద్ రాజ్యంలో పారిశ్రామీకరణ మూడు దశల్లో జరిగింది. మొదటి దశ 1870 –1918 వరకు (నిజాం దివానుగా సాలార్జంగ్ ఉన్న కాలం నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ఆఖరి వరకు), రెండో దశ 1919 నుంచి 1939 వరకు ( రెండో ప్రపంచ యుద్ధాల మధ్యకాలం), మూడో దశ1939 నుంచి 1948 వరకు (రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం నుంచి నిజాం రాజుల పాలన అంతమయ్యే వరకు).
* 1899లో హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే లైన్‌ను మాన్మాడ్కు కలుపుతూ ఏర్పాటు చేయడం వల్ల పత్తి, దానికి సంబంధించిన స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలు నెలకొల్పడానికి తోడ్పడింది.
*1877లో హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్, వీవింగ్ మిల్స్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు.
*1884లో మహబూబ్షాయి గుల్బర్గామిల్స్, 1888లో ఔరంగాబాద్ మిల్స్ నెలకొల్పారు.
*1901 వరకు నిజాం రాజ్యంలో 68 పరిశ్రమలు ఉండేవి.
*1911 – 1922 మధ్య పరిశ్రమలు 121 నుంచి 200కు పెరిగాయి.
* నిజాం రాజ్యంలో 1917లో ఇండస్ట్రియల్ లేబరేటరీని ఏర్పాటు చేసి, పరిశోధనలు చేపట్టారు.
* నిజాం రాజ్యంలో1918లో ప్రత్యేక కామర్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ను రూపొందించారు.
* నిజాం ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కోటి రూపాయలతో 1929లో ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేశారు.
* హైదరాబాద్ రాజ్యంలో పారిశ్రామిక వస్తువుల ప్రదర్శన మొదట 19వ శతాబ్ది మధ్య భాగంలో మొదటి సాలార్జంగ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో మొదలైంది.
*ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శనలు హైదరాబాద్‌లో 1930 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించడం ప్రారంభమైంది.
* చిన్నతరహా పరిశ్రమల ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే సంస్థ ముల్కీ ఇండస్ట్రీస్ పత్రిక నిర్వహించారు.
* చిన్నతరహా ప్రోత్సాహానికి కాలేజ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్(సీఐఐ)ను ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది.
* 1938–39 నాటికి నిజాం సాగర్ ద్వారా జరిగే జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 20 మిలియన్ల కిలోవాట్స్‌కు చేరింది.
* 1916–19లో నిజాం రాజ్యంలో బొగ్గు ఉత్పత్తి 0.65 మిలియన్ టన్నులు.
* 1936–38లో నిజాం రాజ్యంలో బొగ్గు ఉత్పత్తి మిలియన్ టన్నులు.
* 1921లో 200గా ఉన్న భారీ పరిశ్రమల సంఖ్య 1931 నాటికి 387కు చేరింది.
* 1920 ఫిబ్రవరి 14న హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద డి.బి.ఆర్.మిల్స్(దివాన్ బహదూర్ రాంగోపాల్ మిల్లు) అనే బట్టల మిల్లును స్థాపించారు.
* సింగరేణి కాలరీస్ కంపెనీకి ముందు తెలంగాణలో బొగ్గు గనులు తవ్వడం హైదరాబాద్ మైనింగ్ కంపెనీ అనే ఒక లండన్ సంస్థ ప్రారంభించింది.
* 1921లో సింగరేణి కాలరీస్ కంపెనీ(ఎస్.సి.సి.) ఏర్పాటు చేశారు.
*తొలి బొగ్గు గనులు ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే గ్రామంలో బయటపడినందున సింగరేణి కాలరీస్ కంపెనీ అనే పేరు పెట్టారు.
* నిజాం చక్కెర పరిశ్రమను 1937లో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో ఏర్పాటు చేశారు.
*ఆల్విన్ మెటల్ వర్క్స్‌ను 1942లో నిజాం ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రస్టు ఫండ్, మెస్సర్స్ అల్లావుద్దీన్ కంపెనీ ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు.
* ప్రాగాటూల్స్‌ను 1943 మేలో కవాడిగూడలో ఏర్పాటు చేశారు. 1963లో ప్రాగాటూల్స్‌ను రక్షణ మంత్రిత్వశాఖకు అప్పగించారు.
భారతదేశం స్థాపించిన మొదటి కాగితపు మిల్లుల్లో ఒకటైన సిరిపూర్ పేపర్ మిల్లు నుంచి 1942 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది.
ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ కాగజ్‌నగర్‌లో సిరిపూర్ పేపర్ మిల్లు ఉంది.
ALSO READ :దామోదర రాజనర్సింహను నిలదీసిన మహిళలు
* సిమెంట్ రేకుల తయారీకి 1946 జూన్ 17న హైదరాబాద్ ఆస్ బెస్టాస్ కంపెనీ ప్రారంభమైంది.
* వజీర్ సుల్తాన్ టుబాకో (వీఎస్టీ) పరిశ్రమను తొలుత 1916లో హైదరాబాద్‌లోని విటల్వాడిలో ప్రారంభించారు.
* వీఎస్టీ పరిశ్రమను మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ప్రస్తుతం ఉన్న ముషీరాబాద్ ఆజామాబాద్ ప్రాంతానికి 1916లో మార్చారు.
* 1930లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు 200 ఎకరాల విస్తీర్ణం కలిగిన ముషీరాబాద్ – ఆజామాబాద్ ప్రాంతాన్ని పరిశ్రమల స్థాపనకు కేటాయించారు.
* జిందా తిలస్మాత్ను 1920లో హకీం మహ్మద్ మొహినుద్దీన్ ఫారూఖీ స్థాపించారు.
* వరంగల్‌లో స్థాపించిన పరిశ్రమల్లో అతి ముఖ్యమైన ఆజమ్జాహి మిల్స్ అనే బట్టల ఉత్పత్తి పరిశ్రమను 1934లో ఏర్పాటు చేశారు.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను నిజాం కాలంలో హైదరాబాద్ స్టేట్‌బ్యాంక్ పేరుతో పిలిచేవారు.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను ప్రభుత్వ బ్యాంక్‌గా మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1941లో ప్రారంభించారు.
* బ్రిటీష్ ఇండియా కింద ఉన్న అన్ని సంస్థానాల్లో సొంత కరెన్సీ చలామణి చేసుకునే హక్కు నిజాం రాజ్యానికి మాత్రమే ఉండేది.
* దక్కన్ విమానయాన సంస్థను 1945లో నిజాం ప్రభుత్వం, టాటా ఎయిర్‌లైన్స్ కంపెనీ ఉమ్మడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది.