తొలి టీ20లో జింబాబ్వే చేతిలో అనూహ్య రీతిలో ఓటమి పాలైన భారత జట్టు.. నేడు రెండో టీ20కి సిద్ధమైంది. హరారే వేదికగా సోమవారం(జులై 07) ఈ ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు సారథి శుభమన్ గిల్.. మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఖలీల్ అహ్మద్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు, జింబాబ్వే అదే జట్టును కొనసాగిస్తోంది.
కాగా, తొలి టీ20లో ఓటమి పాలైన భారత జట్టు.. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది.
తుది జట్లు
భారత్: శుభమన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
జింబాబ్వే: వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.