స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన స్క్వాడ్‌ను ఎంపికచేసింది. ఈ రెండు జట్లకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా సేవలు అందించనుంది. ఈ మధ్యనే టీ20ల్లో అరంగేట్రం చేసిన శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, సైకా ఇషాక్ వన్డే జట్టుకు ఎంపికయ్యారు.
వన్డే జట్టు: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), జెమీమీ రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, యస్తికా భాటియా(వికెట్ కీపర్), రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటస్ సాధు, పూజా వస్త్రాకర్, స్నేహ్ రానా, హర్లీన్ డియోల్.
టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), జెమీమీ రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, యస్తికా భాటియా(వికెట్ కీపర్), రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటస్ సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి.
ఇండియా vs ఆస్ట్రేలియా షెడ్యూల్
- తొలి వన్డే(డిసెంబర్ 28): వాంఖడే స్టేడియం, ముంబై
- రెండో వన్డే(డిసెంబర్ 30): వాంఖడే స్టేడియం, ముంబై
- మూడో వన్డే(జనవరి 02): వాంఖడే స్టేడియం, ముంబై
- తొలి టీ20(జనవరి 05): డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నావీ ముంబై
- రెండో టీ20(జనవరి 07: డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నావీ ముంబై
- మూడో టీ20(జనవరి 09): డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నావీ ముంబై
వన్డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు, టీ20 మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.