ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి టీ20లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత మహిళా బ్యాటర్లు.. రెండో టీ20లో మాత్రం తేలిపోయారు. బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయారు. పరుగులు చేయడానికి నానా అవస్థలు పడ్డారు. 19 పరుగులు చేసిన షఫాలి వర్మే టాప్ స్కోరర్. మమ్మల్ని ఓడించలేరన్న అతి నమ్మకమే భారత బ్యాటర్ల కొంపముంచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు స్మ్రితి మందాన(13), షఫాలి వర్మ(19) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ వెంటవెంటనే ఔట్ అవ్వడంతో టీమిండియా కోలుకోలేకపోయింది. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు.. వెంటవెంటనే ఫెవిలియన్ చేరారు.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(0) డకౌట్ కాగా, జెమీమా రోడ్రిగ్స్ (8), యస్తిక భాటియా(11), హర్లీన్ డియోల్(6), దీప్తి శర్మ(10).. ఇలా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలోసుల్తానా ఖాతూన్ 3వికెట్లు తీసుకోగా.. ఫాహిమా ఖాతూన్ 2, మరుఫా అక్తర్ 1, నహిదా అక్తర్ 1, రబేయా ఖాన్ 1 వికెట్ తీసుకున్నారు.
?? CAN WE DEFEND THIS? It's going to be a tough task for our bowlers!
— The Bharat Army (@thebharatarmy) July 11, 2023
?? We got this, girls. Let's bring our A-game with the ball!
? Getty • #INDvBAN #BANvIND #BANWvINDW #TeamIndia #BharatArmy pic.twitter.com/HM1xgvBn8U