ఆదివారం(జూన్ 16) నుంచి భారత్, దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మూడు మ్యాచ్‍లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత మహిళా జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా.. సఫారీ జట్టుకు లారా వోల్వార్డ్ట్ నాయకత్వం వహిస్తోంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు.. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. అనంతరం ఏప్రిల్-మే నెలల్లో బంగ్లాదేశ్ గడ్డపై ఆతిథ్య జట్టును 5-0తో ఓడించింది. హర్మన్ సేన సొంతగడ్డపై పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు, సఫారీ జట్టు భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా మహిళా వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ఈ సిరీస్‌ను భారతీయ క్రికెట్ అభిమానులు Sports18 1 TV ఛానెల్‌లో ప్రత్యక్షంగా ఆస్వాదించవచ్చు. డిజిటల్‌గా JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా చూడవచ్చు. అదే దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులైతే, సూపర్‌స్పోర్ట్స్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు.
వన్డే సిరీస్ షెడ్యూల్
- జూన్ 16న మొదటి వన్డే: చిన్నస్వామి స్టేడియం(బెంగళూరు)
- జూన్ 19న రెండో వన్డే: చిన్నస్వామి స్టేడియం(బెంగళూరు)
- జూన్ 23 మూడో వన్డే: చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)
భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ , రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రి (వికెట్ కీపర్), దయాళన్ హేమలత , రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, పూజా వస్త్రాకర్.
దక్షిణాఫ్రికా మహిళా జట్టు: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అన్నెకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్‌సెన్, మైకే డి రిడర్ (వికెట్ కీపర్), సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, మసాబా క్లాస్, సునే లూస్, ఎలిజ్-మారి మార్క్స్, మ్లాబా, తుమీ సెఖుఖునే, నొందుమిసో షాంగసే, డెల్మీ టక్కర్.