బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. 127 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 117 పరుగులు చేసింది. వన్డే కెరీర్లో ఆమెకిది ఆరో సెంచరీ కాగా, గత రెండేళ్లలో మొదటిది. దాంతో, భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది.
99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టును మంధాన- దీప్తి శర్మ జోడి ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 81 పరుగులు జోడించి భారత్ను 250 పరుగులు దాటేలా చేశారు. మంధాన శతకం(117) బాదగా.. దీప్తి శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. షఫాలీ వర్మ(7), హేమలత(12), హర్మన్ప్రీత్ కౌర్ (10), జెమిమా రోడ్రిగ్స్(17), రిచా ఘోష్(4) విఫలమయ్యారు.
The moment Smriti Mandhana completed her Century 👏 ❤️#CricketTwitter #INDvSA pic.twitter.com/3b4X8RgI2o
— Female Cricket (@imfemalecricket) June 16, 2024
సఫారీ బౌలర్లలో అయిబొంగ ఖాకా 3 వికెట్లు తీసుకోగా.. క్లాస్ 2, డెర్క్సెన్, లాబా, షాంగసే తలా ఒక వికెట్ పడగొట్టారు.
Smriti Mandhana sparkles with her sixth ODI century as India make 265/8 in Bengaluru #INDvSA
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2024
👉 https://t.co/4rlRlxv6tZ pic.twitter.com/YYqsHXgBCp