INDW vs SAW: మంధాన వరుసగా రెండో సెంచరీ.. మిథాలీ ఆల్‌ టైమ్‌ రికార్డు సమం

INDW vs SAW: మంధాన వరుసగా రెండో సెంచరీ.. మిథాలీ ఆల్‌ టైమ్‌ రికార్డు సమం

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత మహిళా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పరుగుల వరద పారిస్తోంది. తొలి వన్డేలో సెంచరీ(117) బాదిన ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్.. బుధవారం(జూన్ 19) జరుగుతోన్న రెండో వన్డేలోనూ శతకం బాదింది. 120 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసింది. తద్వారా భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డు సమం చేసింది. .

ఇదిలావుంటే, వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి నిలిచింది. భారత్ తరఫున ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు నమోదు చేసిన తొలి బ్యాటర్‌ కూడా ఈమెనే. 

భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు

  • స్మృతి మంధాన: 84 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు
  • మిథాలీ రాజ్: 211 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు
  • హర్మన్‌ప్రీత్ కౌర్: 132 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు
  • పూనమ్ రౌత్: 73 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు
  • తిరుష్ కామిని: 37 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు

భారీ లక్ష్యం

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. మంధాన(136), హర్మన్‌ప్రీత్ కౌర్(103 నాటౌట్) ఇద్దరు సెంచరీలు చేశారు. షఫాలీ వర్మ(20), దయాళన్ హేమలత(24), రిచా ఘోష్ (25 నాటౌట్) పరుగులు చేశారు.