
శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ( మార్చి 21 ) రాత్రి ఉన్నట్టుండి కురిసిన అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు నాశనమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లగా.. హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై జనం ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా వరద నీటిలో పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది.
హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్ దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. మ్యాన్ హోల్ దగ్గర పసికందు మృతదేహాన్ని గుర్తించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పసికందుకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు.