వరంగల్ లోని రంగంపేటలో కారులో డెడ్ బాడీ కలకలం రేపుతోంది. వ్యక్తిని దారుణంగా చంపి మృతదేహాన్ని కారులో వదిలిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. డిసెంబర్ 3న రంగంపేటలో ని కేఎంసీ ఎదురుగా ఆగి ఉన్న కారులో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డెడ్ బాడీ ఉన్న కారును పరిశీలించారు వరంగల్ ఏసీపీ నంది రాం నాయక్ . కత్తులతో పొడిచి హత్య చేసినట్టుగా చెప్పారు. కారు నెంబర్ ను బట్టి దర్యాప్తు చేయగా.. కాకతీయ గ్రామీణ బ్యాంకు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వెలుగట్టి రాజమోహన్ గా గుర్తించారు పోలీసులు. ఎవరు ఎందుకు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విచారణ తర్వాత పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.