వైర్లెస్ ఛార్జర్, రూ.20వేల లోపు ధర.. కొత్త స్మార్ట్ఫోన్  వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవిగో 

వైర్లెస్ ఛార్జర్, రూ.20వేల లోపు ధర.. కొత్త స్మార్ట్ఫోన్  వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవిగో 

ఇటీవల కాలంలో Infinix  Note 40 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.. దీని తర్వాత  Infinix ఎలాంటి ఫోన్లను విడుదల చేయలేదు..అయితే త్వరలో Infinix Note 40  5G   బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. అదే సమయంలో డివైజ్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా నిర్ధారిస్తుం ది. ఈ హ్యాండ్ సెట్   Infinix  Note 40 Pro స్మార్ట్ ఫోన్ మాదిరిగానే వైర్ లెస్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. ధర మాత్రం 20వేల లోపే ఉంటుందని అంచనా. దీనికి సం బంధిం చిన ఫీచర్లు, లాంచింగ్ తేదీని కంపెనీ ప్రకటించింది. 

Infinix  Note 40 స్మార్ట్ ఫోన్ ను జూన్ 21, 2024 న ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.అదే సమయంలో డివైజ్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా నిర్ధారిస్తుంది. Infinix Note 40 120Hz AMOLED డిస్‌ప్లేతో వస్తుందని, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుందని నిర్ధారించబడింది. Infinix షేర్ చేసిన ఫొటోల ప్రకారం.. రాబోయే స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో పంచ్ హోల్ స్టైల్ నాచ్‌ను కలిగి ఉంటుంది, అదే సమయంలో ట్రిపుల్ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది.

15 W వైర్ లెస్ MagCharge , 33W వైర్డ్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రూ. 20వేల కంటే తక్కువ ధర  ఉంటుందని..  మంచి ఆఫర్లతో లాంచ్ అవుతుందని టెకీ వరల్డ్ అంచనా వేస్తుంది. Infinix Note 40 హ్యాండ్ సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌, 6.78అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది అల్ట్రా నారో బెజెల్స్ , 93.8 శాతం స్క్రీన్  టుబాడీ రేషియోను కలిగి ఉంది.అదనంగా Infinix Note 40 5G  స్మార్ట్ ఫోన్ లో  JBL ట్యూనింగ్ సౌండ్ సిస్టమ్‌ ఉంటుందని అంచనా. ఇది 360డిగ్రీల సౌండ్‌తో గత వెర్షన్‌తో పోల్చితే బాస్ పనితీరులో 58 శాతం బూస్ట్‌ను అందిస్తుంది.