
ఇన్ఫినిక్స్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ నోట్ 50ఎస్‌ను విడుదల చేసింది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ముందు 13 ఎంపీ కెమెరా, వెనుక రెండు కెమెరాలు, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, అండ్రాయిడ్ 15 ఓఎస్వంటివి దీని ప్రత్యేకతలు. 8జీబీ+128జీబీ ధర రూ.16 వేలు కాగా, 8జీబీ+256 జీబీ వేరియంట్‌కు రూ.18 వేలు. ఈ నెల 24 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.