
ఇన్ఫినిక్స్ తన తాజా స్మార్ట్‌ఫోన్, నోట్ 50ఎక్స్5జీ ఫోన్‌ను మనదేశ మార్కెట్లో విడుదల చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌తో తయారైన ఫోన్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల డిస్‌ప్లే, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఎక్స్ఓఎస్15 సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. 6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 కాగా, 8జీబీ+ 128జీవీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.12,999 చెల్లించాలి. అమ్మకాలు వచ్చే నెల మూడో తేదీ నుంచి మొదలవుతాయి.