Infinix Smart 8 Plus బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. దీనిని ఇటీవల మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే శనివారం (మార్చి9) నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఫ్లిప్ కార్ట్ లో లభ్యమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లలో 18W టైప్ C ఫాస్ట్ చార్జింగ్ తో 6000 mAh బ్యాటరీ హైలైట్. సరసమైన ధర, మంచి పనితీరును కస్టమర్లకు అందించేందుకు Infinix ఈ హై ఎండ్ ఫంక్షనాలిటీ స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేసింది.
Infinix Smart 8 Plus స్మార్ట్ ఫోన్ ఫీచర్లు:
- 6000mAh బ్యాటరీ, 18 W టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్
- 50 MP డ్యుయెల్ AI కెమెరా, క్వాడ్ LED రింగ్ ఫ్లాష్
- అధిక నాన్యత గల సెల్ఫీ లకోసం 8MP ఫ్రంట్ కెమెరా
- 90Hz రీఫ్రెష్ రేట్, పంచ్ హోల్ డిస్ ప్లే, మ్యాజిక్ రింగ్ ఫీచర్
- సెక్యూరిటీకోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్, ఫేషియల్ రికగ్నిషన్
- MediaTeck Helio G36 Octa కోర్ ప్రాసెసర్ తో 8GB వరకు RAM
- 128 GB అంతర్గత స్టోరేజ్, మైక్రో SD తో 2 TB వరకు స్టోరేజ్ ని పెంచుకోవచ్చు.
- నిరంతర సేవలకోసం Android 13 Go(XOS13) అపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది.