- వరుసగా రెండో నెలలోనూ ఆర్‌బీఐ లిమిట్‌లోపే
న్యూఢిల్లీ: దేశంలో ఇన్‌ఫ్లేషన్ మరింత తగ్గింది. కిందటి నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 5.72 శాతానికి దిగొచ్చింది. అంతకు ముందు నెలలో 5.88 శాతంగా రికార్డయ్యింది. వరుసగా రెండో నెలలో కూడా ఆర్‌బీఐ పెట్టుకున్న రేంజ్ 2–6 శాతం మధ్యలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఉంది. నెల వారీగా చూస్తే ఇన్‌ఫ్లేషన్ డిసెంబర్‌లో 0.4 శాతం తగ్గింది. ఆహార పదార్ధాల ధరలు తగ్గడంతో ఇన్‌ఫ్లేషన్ కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) దిగొచ్చిందని చెప్పొచ్చు. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ నవంబర్‌లో 4.67 శాతంగా నమోదవ్వగా, డిసెంబర్‌లో 4.19 శాతానికి తగ్గింది. ఇన్‌ఫ్లేషన్ తగ్గడంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తక్కువగా పెంచుతుందనే అంచనాలు పెరిగాయి.
పెరిగిన ఫ్యాక్టరీ అవుట్‌పుట్..
దేశంలోని పరిశ్రమల ప్రొడక్షన్ కిందటేడాది నవంబర్‌లో మెరుగుపడింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కొలిచే ఐఐపీ ఏడాది ప్రాతపదికన నవంబర్‌లో 7.1 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ 5.5 శాతం పెరిగింది. నవంబర్‌లో మాన్యుఫాక్చరింగ్ అవుట్‌పుట్ 6.1 శాతం వృద్ధి చెందగా, మైనింగ్ అవుట్‌పుట్ 9.7 శాతం పెరిగింది. పవర్ జనరేషన్ 12.7 శాతం ఎగిసింది.