హిమాయత్ సాగర్ మరో 4 గేట్ల ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌లోకి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ రిజర్వాయర్ లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా మారిన నేపథ్యంలో శనివారం (జులై 22న) మరో నాలుగు గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు.

శుక్రవారం (జులై 21న) రెండు గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు శనివారం ఉదయం 10 గంటలకు మరో రెండు గేట్లు, మధ్యాహ్నం ఒంటి గంటకు మరో రెండు గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేశారు. నాలుగు గేట్లను కూడా రెండు ఫీట్ల మేర ఎత్తి.. నీటిని విడుదల చేస్తున్నారు. 6 గేట్ల ద్వారా మొత్తం 4120 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీలోకి విడుదల చేస్తున్నారు.

మరోవైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ కు 300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.980 టీఎంసీలుగా ఉంది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.85 అడుగులుగా ఉంది.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు :  (శనివారం సాయంత్రం 6 గంటల వరకు) 

పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 1763.25 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.875 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 3500 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 4120 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 06

ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ వివరాలు : 

పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 1785.85 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.900 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.980 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 300 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 0 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 13
ఎత్తిన గేట్ల సంఖ్య : 0