శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్ట్ కు మరోసారి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లను 10 అడుగులు మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. గంటగంటకు ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో వరదను బట్టి గేట్లను ఆపరేట్ చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2 లక్షల 43 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

దీంతో 10గేట్ల ద్వారా లక్షా 96వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 63వేల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ అయిన 215టీఎంసీలను మెయింటేన్ చేస్తూ.. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు.