Shocking news: జ్యోతిష్యుడు చెప్పాడని.. రెండో పెళ్లి కోసం.. భార్య, ముగ్గురు పిల్లల్ని కాల్చి చంపేశాడు

Shocking news: జ్యోతిష్యుడు చెప్పాడని.. రెండో పెళ్లి కోసం.. భార్య, ముగ్గురు పిల్లల్ని కాల్చి చంపేశాడు

అర్థరాత్రి..అపార్టుమెంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు ఆ సైకో భర్తలో క్రూరమృగం నిద్ర లేచింది. తన కోరిక నెరవేరడం లేదని..తన దారికి వాళ్లే అడ్డం అని జ్యోతిష్యుడి చెప్పాడని.. భార్య పిల్లలను కడతేరిస్తే తనకు విజయం వరిస్తుందని పిచ్చిగా నమ్మిన ఓ దుర్మార్గుడు.. ఆదమరిచి నిద్రపోతున్న భార్య, ముగ్గురు చిన్నారులను అత్యంత దారుణంగా కాల్చి చంపిన ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

సోమవారం (నవంబర్ 4) అర్థరాత్రి రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెను దారుణంగా కాల్చి చంపిన షాకింగ్ ఘటన యూపీలోని వారణాసిలో వెలుగు చూసింది. రాజేంద్ర గుప్త ఇంట్లో టెనెంట్లు మంగళవారం మధ్యాహ్నం హత్యలు జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నింది తుడు రాజేంద్ర గుప్తా పరారీలో ఉన్నాడు. 

రాజేంద్ర గుప్తా భార్య నీతు గుప్తా (45), కుమారులు నవేంద్ర గుప్తా(25), సుబేంద్ర గుప్తా ( 15), కుమార్తె గౌరాంగి( 16) లను సోమవారం అర్థరాత్రి తుపాకీతో కాల్చి పరార య్యాడు.. మరుసటి హత్యలను గుర్తించిన రెంటర్స్ పోలీసులు సమాచారం ఇవ్వడంలో ఘటన వెలుగులోకి వచ్చింది. 

రాజేంద్రగుప్తా తరుచు తన భార్య నీతుతో గొడవలు పడుతుండేవాడని..మళ్లీ రెండో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించమని వేధిస్తూండే వాడని అతని ఇంట్లో కిరాయి కి ఉండే వ్యక్తులు చెపుతున్నారు.  తన విజయానికి భార్య అడ్డుగా ఉందని ఓ జ్యోతిష్యుడు చెప్పడం, అతని సూచనల మేరకే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. 

రాజేంద్ర గుప్తా హత్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో తన తండ్రిని, వాచ్ మెన్ కూడా కాల్చి చంపాడు. రెంటర్స్ ఇచ్చిన సమాచారం మేరకు బేళుపూర్  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రాజేంద్ర గుప్తా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని మొబైల్ ఫోన్ ద్వారా లోకేషన్ ను ట్రాక్ చేస్తున్నారు.