ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..ఎంతలా దూసుకుపోతోంది..ఏఐ విస్తరించని రంగమంటూ లేదు..ఏఐ మోడల్స్ అందాల పోటీల్లో కూడా పాల్గొంటున్నాయి. ప్రపంచం లో మొదటి సారిగా జరిగిన మిస్ AI పోటీల్లో కిరీటాన్ని మొరాకో కు చెందిన ఇన్ ఫ్లుయెన్సర్ కెంజా లైలీ గెలుచుకుంది. లైలీ 1500 ఏఐ మోడళ్లలో అగ్రస్థానంలో నిలి చింది. లైలీకి ప్రాణం పోసిన మెరియం బెస్సాకోసం రూ. 16లక్షలు సంపాదించిపెట్టింది. లైలీకి ఇన్ స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలొవర్స్ ఉన్నారు.
లైలీ ఆహారం, సంస్కృతి, ఫ్యాషన్, అందం, ట్రావెల్స్ వంటి వాటిపై కంటెంట్ ఇస్తుంది. కెంజా లైలీ ఈ వర్చువల్ రోల్ లో మొరాకో గొప్ప వారసత్వాన్ని చాటుకుంది. లైలీ సంస్కృతి, సాంకేతికల ప్రత్యేక కలియికగా రూపం పోసుకుంది. మొత్తం ఏడే భాషల్లో ఫాలొవర్లతో రోజులో 24గంటలూ టచ్ లో ఉంటుంది.
మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శించడమే కాకుండా, తన ఫాలోవర్లకు వివిధ రంగాలలలో సమాచారం అందించడమే తన లక్ష్యం అని ఈ ఏఐ మోడల్ చెబు తోంది. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా రోబో సంస్కృతిపై అవగాహన కల్పించాలని అకాంక్షిస్తోంది.
ఈ పోటీలో ఫ్రాన్స్ కు చెందిన లాలినా వాలినా రెండో స్థానంలో నిలిచింది.. పోర్చుగల కు చెందిన ఒలివియా సీ మూడో స్థానంలో ఉంది. భారత దేశం నుంచి జారా శతావరి టాప్ 10 ఫైనలిస్ట్ లో నిలిచినా టైటిల్ దక్కించుకోలేకపోయింది.