ట్రేడింగ్ యాప్ మోసం.. రూ.6 కోట్లు మోసపోయిన వ్యాపారవేత్త

ట్రేడింగ్ యాప్ మోసం.. రూ.6 కోట్లు మోసపోయిన వ్యాపారవేత్త




లేటెస్ట్ టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆన్ లైన్ మోసాలు అంతే రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఉద్యోగాల పేరుతో మోసాలు, పెట్టుబడుల పేరుతో ఫ్రాడ్, ఖాతాదారులు వివరాలను దొంగిలించి మరో విధంగా ఆన్ లైన్ సైబర్ నేరాలకు పాల్పడతున్నారు ఫ్రాడ్ స్టర్లు..ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ ట్రేడింగ్ మోసాలు ఎక్కువయి పోయాయి..మోసగాళ్లా మాటలు నమ్మి లక్షల్లోపెట్టుబడులు పెట్టి ఇన్వెస్టర్లు మోసపోతున్నారు.నకిలీ ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ లను సృష్టించి సైబర్ ఫ్రాడ్ స్టర్లు ఇన్వెస్టర్లు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.. కేరళలోని యర్నాకులంలో ఓ బిజినెస్ మ్యాన్ ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టి రూ. 6 కోట్లు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. 

కేరళలోని కొచ్చికి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ఫేక్ స్టాక్ ట్రేడింగ్ యాప్ ను నమ్మి  రూ. 6 కోట్లు పోగొట్టుకున్నారు. ఇతను కొచిలోని ఐటీ పార్క్ లో కంపెనీ రన్ చేస్తున్నాడు. మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆన్ లైన్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. 

ఇంటర్నెట్ లో ఆన్ లైన్ ట్రేడింగ్ కోసం వెబ్ సైట్ ను వెతికిన బాధిత బిజినెస్ మ్యాన్ కు ఓ ఫ్రాడ్ సైట్ దొరికింది. ఈ ఫ్లాట్ ఫాంలో గతేడాది ఆగస్టులో పెట్టుబడి పెట్టి ఆన్ లైన ట్రేడం ప్రారంభించాడు. ఇప్పటివరకు రూ. 5 కోట్ల  డబ్బును ట్రేడింగ్ లో పెట్టాడు.. అయితే ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి, లాభం డ్రా చేసుకోవాలంటే మరో కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని ఆన్ లైన్  మోసగాళ్లు చెప్పారు. దీనికి కూడా అంగీకరించిన ఆ బిజినెస్ మ్యాన్ మరో రూకోటి మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశాడు. మొత్తంగా రూ. 6 కోట్లు వారికి సమర్పించుకున్నారు. మోస పోయానని తెలుసుకొని ఇన్ఫో పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ కేసును సవాల్ గా స్వీకరించిన ఎర్నాకులం పోలీసులు.. దర్యాప్తు సీరియసప్ గా ప్రారంభించారు.  పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నగదు కేరళతోపాటు దేశంలోని వివిధ లోకేషన్లలో మోసాగాళ్ల కు చెందిన చాలా అకౌంట్లకు బదిలీ చేయబడింది.సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కుకుండా ఒకేసారి 300 నగదు బదిలీలు చేశారు. షెల్ కంపెనీల పేరుతో ఈ నగదు విత్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి డబ్బును పోగొట్టుకున్న వారు 1930 కి కాల్ చేసి పోలీసులు ఫిర్యాదు చేయాలని సూచించారు.  

ఇదొక్కటే కాదు.. గడిచిన రెండు నెలల్లో రూ. 20 కోట్లు ఆన్ లైన్ ఫ్రాడ్ జరిగిందని ఎర్నాకులం పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు కోటి రూపాయలు రికవరీ చేసినట్లు  కోచి సిటీ పోలీస్ కమిషనర్ చెబుతున్నారు. మరో మూడు కోట్లు రికవరీ ప్రాసెస్ లో ఉన్నాయన్నారు.