బెంగళూరు: గ్లోబల్ ఎనర్జీ కంపెనీ బీపీ నుంచి ఇన్ఫోసిస్ పెద్ద ఆర్డరును దక్కించుకుంది. ఎండ్ టూ ఎండ్ అప్లికేషన్స్ కోసం ప్రైమరీ పార్ట్నర్గా బీపీ ఇన్ఫోసిస్‌ను ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ఒక ఎంఓయూపై రెండు కంపెనీలు సంతకాలు చేశాయి.
డెవలప్మెంట్, మోడర్నైజేషన్, మేనేజ్మెంట్, మెయింట్‌నెన్స్ వంటి సేవలను ఇన్ఫోసిస్ ఈ కాంట్రాక్టు కింద అందించాల్సి ఉంటుంది. 20 ఏళ్లుగా రెండు కంపెనీల మధ్య అనుబంధాన్ని తాజా ఒప్పందం మరింత బలపరుస్తుందని ఇన్ఫోసిస్ ఒక స్టేట్మెంట్లో తెలిపింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం చేసేందుకు ఇన్ఫోసిస్‌తో కలిసి పనిచేయడం ఆనందం కలిగిస్తోందని మరోవైపు బీపీ కూడా పేర్కొంది.