వేంకటేశ్వరుడికి రూ.కోటి 25 లక్షల అభిషేక శంఖం.. విరాళంగా ఇచ్చిన సుధా మూర్తి దంపతులు

ఇన్ఫోసిస్​ కోఫౌండర్​ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు తిరుమల శ్రీవారికి కోట్ల విలువైన కానుక అందజేశారు. జులై 16న వీఐపీ బ్రేక్​దర్శనంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి 2 కిలోల బరువున్న రూ.కోటి 25 లక్షల విలువైన బంగారు అభిషేక శంఖాన్ని అందజేశారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. జులై 17 శ్రీవారి కొండపై భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. చాలా కంపార్ట్​మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు.