Infosys Layoffs:700 మంది ఉద్యోగుల తొలగింపు..క్లారిటి ఇచ్చిన ఇన్ఫోసిస్

Infosys Layoffs:700 మంది ఉద్యోగుల తొలగింపు..క్లారిటి ఇచ్చిన ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్ లేఆఫ్ ప్రకటించింది. ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ లో పనిచేస్తున్న దాదాపు 700 మంది ట్రైనీ ఉద్యోగులను తొలగిస్తోంది. వీరికి ఎటుంటి ప్యాకేజీలు ప్రకటించలేదు. కనీస అర్హత ప్రమాణాలు పాటించకపోవడంతో దాదాపు 400  మంది ఉద్యోగులను బ్యాచ్ లుగా పిలిచి అల్టీమేటం లెటర్ జారీ చేసింది ఇన్ఫో సిస్. అయితే ఇన్ఫోసిస్ చర్యను నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఖండించింది. 

తొలగింపులపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. వాస్తవానికి 350 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. శిక్షణ పూర్తయిన తర్వాత ట్రైనీ ఎంప్లాయీస్  కి మూడు అసెస్ మెంట్లు ఇస్తారు..వాటిని క్లియర్ చేయకపోతే సంస్థలో కొనసాగలేరని తెలిపింది. 

ALSO READ | 

ఈ ప్రక్రియ ఇప్పటినుంకాదు.. రెండు దశాబ్దాలుగా అమలు లో ఉందని తెలిపింది. 
ఇన్ఫోసిస్ ఉద్యోగుల తొలగింపుపై NITES భారత కార్మిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి అధికారిక ఫిర్యాదును దాఖలు చేస్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించాలని కోరింది.