బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, ఐఐఎస్‌సీ మాజీ డైరెక్టర్ బలరామ్, మరో 16 మందిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దుర్గప్ప మాజీ ఐఐఎస్ సీ ఎంప్లాయీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
గిరిజన బోవి కమ్యూనిటీకి చెందిన పిటిషనర్ గతంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉన్నారు. 2014లో తనను హనీ ట్రాప్ కేసులో తప్పుడు ఇరికించి తనను సర్వీసు నుంచి తొలగించారని దుర్గప్ప ఆరోపించారు. కుల ఆధారిత దూషణలు, బెదిరింపులను తాను భరించానని ఫిర్యాదులో తెలిపారు.
క్రిస్ గోపాలకృష్ణన్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు ఉన్నారు. ఈ కేసులో గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వరైహ్, హరి కెవిఎస్, దాసప్ప, బలరామ్ పి, హేమలతా మిషి, ఛటోపాద్యాయ కె, ప్రదీప్ డి సావ్కర్ ,మనోహరన్ లపై కూడా కేసు నమోదు చేశారు.