
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల కంపెనీ ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ నుంచి 240 మంది ట్రెయినీలను తొలగించింది. ఇంటర్నల్అసెస్మెంట్ టెస్టుల్లో వీళ్లు ఫెయిల్కావడమే ఇందుకు కారణమని తెలిసింది. కంపెనీ గత నెలలోనూ ఇదే కారణంతో 40 మంది తీసేసింది. ప్రిపరేషన్‌కు అదనపు సమయం ఇచ్చినా, సందేహాలను నివృత్తి చేసినా, అనేక మాక్ అసెస్‌మెంట్‌లు చేసినా 'జెనరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్'కు అర్హత సాధించలేకపోయారని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
అంతకుముందు కూడా ఇన్ఫోసిస్ కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్‌లో దాదాపు 350 మంది ట్రైనీలను తొలగించింది. ఈ ట్రైనీలు 2.5 సంవత్సరాలపాటు ఎదురుచూశాక నియమితులయ్యారు. వీరికి ఒక నెల జీతం ఎక్స్-గ్రేషియాగా చెల్లించారు.