కోచింగ్ సెంటర్లంటే నాకు నచ్చవు.. అవి అలాంటి వాళ్లకే అవసరం: ఇన్ఫోసిస్ మూర్తి

కోచింగ్ సెంటర్లంటే నాకు నచ్చవు.. అవి అలాంటి వాళ్లకే అవసరం: ఇన్ఫోసిస్ మూర్తి

ప్రస్తుతం కోచింగ్ క్లాసుల గురించి చెప్పాల్సిన పని లేదు.. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలన్నా కోచింగ్ తప్పనిసరని భావిస్తున్నారు విద్యార్థులు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కోచింగ్ సెంటర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోచింగ్ సెంటర్లపై తనకు నమ్మకం లేదన్నారు. క్లాస్ రూంలో టీచర్లు చెప్పే పాఠాలపై శ్రధ్ద పెట్టని వారికే కోచింగ్ క్లాసులు అవసరమని వ్యాఖ్యానించారు.  బెంగళూరులో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐఐటీలు,నీట్  వంటి  కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లు  ఏ విధంగా ఉపయోపడతాయా అనే ప్రశ్నకు మూర్తి కోచింగ్ సెంటర్లపై తన అభిప్రాయాన్ని చెప్పారు. కోచింగ్ క్లాసులకు వెళ్ళే చాలా మంది విద్యార్థులు  స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలను జాగ్రత్తగా వినరు. అలాగే  తరచుగా తమ పిల్లలకు చదువులో సహాయం చేయలేని తల్లిదండ్రులే కోచింగ్ సెంటర్లపై దృష్టిపెడతారని చెప్పారు.

Also Read:-అమెరికా ప్రజలు ఎవరివైపున్నారు..హారిస్ లేదా ట్రంప్?

ఎలా నేర్చుకోవాల తెలుసుకోవడమే అసలైన విద్యావిధానమ మూర్తి చెప్పారు.  దురదృష్టవశాత్తు మన దేశంలో బట్టీ చదువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు..దీని వల్ల విద్యార్థుల్లో ఆలోచించే శక్తి ఉండటం లేదన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించాలన్నారు. తల్లిదండ్రులు పుస్తకాలు పట్టుకుని చదివితే పిల్లలు కూడా చదువుతారని చెప్పారు మూర్తి.