న్యూఢిల్లీ: మనదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ రూ.32,403 కోట్ల జీఎస్టీ కట్టాలంటూ ప్రీషోకాజ్నోటీసు జారీ అయింది. 2017 నుంచి ఐదేళ్ల వరకు ఇన్ఫోసిస్ తన విదేశీ శాఖల నుండి పొందిన సేవల కోసం పన్ను చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు.
జూలై 2017 నుంచి 2021–-22 వరకు రూ. 32,403.46 కోట్లను ఐజీఎస్టీగా చెల్లించాలని స్పష్టం చేశారు. దీనిపై ఇన్ఫీ స్పందిస్తూ ఈ ఖర్చులకు జీఎస్టీ వర్తించబోదని తెలిపింది.