హైదరాబాద్, వెలుగు : కార్పొరేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఐదో ఎడిషన్‌లో ఇన్ఫోసిస్ జట్టు టీమ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆప్టమ్ జట్టును ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. చాలెంజర్స్ కప్ ఫైనల్లో టీమ్ నోవార్టిస్... జేపీ మోర్గాన్ ఛేజ్ పై విజయం సాధించింది. హైటెక్ సిటీ గేమ్ పాయింట్ లో రెండ్రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో రుత్విక దాస్, ప్రణవ జైన్ సింగిల్స్‌లో టైటిళ్లు గెలిచారు.
విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో రుత్విక దాస్ (టీసీఎస్) 30–-23తో గీత (జేపీఎంసీ)ని ఓడించింది. మెన్స్ ఫైనల్లో ప్రణవ జైన్ కు వాకోవర్ విజయం లభించింది. మెన్స్ డబుల్స్ ఫైనల్లో అవ్వారు సతీష్ బాబు– దొంతు సాయి రామ్ (ఎఫ్‌ఐఎన్‌ఎంకేటీ) 30–-22తో భరత్– మనోజ్ (ఇన్ఫోసిస్)ను ఓడించారు. విమెన్స్ డబుల్స్‌లో పూజా –రిత్విక దాస్ (టీసీఎస్) , మిక్స్‌డ్ డబుల్స్‌లో భరత్– మౌసమ్ (ఇన్ఫోసిస్) విజేతలుగా నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంకణాల స్పోర్ట్స్ గ్రూప్ చైర్మన్ కంకణాల అభిషేక్‌రెడ్డి, గేమ్ పాయింట్ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ రెడ్డితో కలిసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
Also Read : గాంధీ ఆస్పత్రి ఈఎన్టీ హెడ్‌గా భూపేందర్ సింగ్ రాథోడ్