
న్యూఢిల్లీ:ఇన్ఫోసిస్ తాజాగా తొలగించిన ట్రెయినీలలో వంద మంది ప్రధాని మోదీ ఆఫీసుకు లెటర్ పంపారు. తమను ఉద్యోగం నుంచి తీసేయడంపై జోక్యం చేసు కోవాలని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, అసెస్‌మెంట్ టెస్ట్ ఫెయిలైనందుకు 300 మందికి పైగా ట్రెయినీలను ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ తీసేసిన విషయం తెలిసిందే. వీరు ఫండమెంటల్ టెస్ట్ పాస్ అవ్వగా, అసెస్‌మెంట్ టెస్ట్‌లో ఫెయిలయ్యారు. రెండేళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్‌లో ఉన్న వీరిని ఇన్ఫోసిస్ సడెన్‌గా తీసేసింది.