తగ్గిన కీలక ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా రంగాల వృద్ధి

తగ్గిన కీలక ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా రంగాల వృద్ధి

న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి సెప్టెంబరు నెలలో రెండు శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే నెలలో 9.5 శాతంగా నమోదయింది. అయితే ఆగస్టులో వృద్ధి 1.6 శాతం కాగా, ఉత్పత్తి వృద్ధి సానుకూలంగా ఉంది. ఎనిమిది కీలక రంగాలలో మూడు విభాగాలు ముడి చమురు, సహజ వాయువు, విద్యుత్ -- సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.

బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్  విద్యుత్ ప్రధాన రంగాల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-–సెప్టెంబర్ మధ్యకాలంలో 4.2 శాతంగా ఉంది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 8.2 శాతంగా ఉంది.  మొత్తం పారిశ్రామిక వృద్ధిని కొలిచే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి)కి ఎనిమిది ప్రధాన రంగాలు 40.27 శాతం సహకారం అందిస్తున్నాయి.