పద్మారావునగర్, వెలుగు: బన్సీలాల్ పేట డివిజన్ హమాలీ బస్తీలో బొడ్రాయి ప్రతిష్ట ప్రారంభ పూజలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ పూజల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ బీఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్‌లతో కలిసి పాల్గొన్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఈ నెల 25వ తేదీన రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్సమక్షంలో బొడ్రాయిని ప్రతిష్టించనున్నట్లు బస్తీ వాసులు తెలిపారు. బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బస్తీలో బొడ్రాయి ప్రతిష్టకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బన్సీలాల్‌పేట డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఎల్. వెంకటేశన్ రాజు, బస్తీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.