
అయిజ, వెలుగు: మండలంలోని సంకాపురం గ్రామంలో ఉపాధి పనులు చేస్తుండగా ఈడిగ ఈరన్న గౌడ్ కు గాయాలయ్యాయి. శుక్రవారం గ్రామ శివారులోని పెద్దబావి చెక్ డ్యాం వద్ద జరుగుతున్న పూడికతీత పనులకు వెళ్లాడు. మట్టి దిబ్బపై నిలబడి పని చేస్తుండగా, కాలుజారి కింద పడ్డాడు. దీంతో అతడి కాలు రెండు చోట్ల విరిగింది. ఘటనా స్థలాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ ఉత్తనూరయ్య , సీనియర్ మేట్ నాగరాజు, టెక్నికల్ అసిస్టెంట్ అశోక్ పరిశీలించి, ఈరన్నను అయిజ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూల్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.