Viral Video: మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన కోతి..ఓనర్, కస్టమర్లు షాక్

Viral Video: మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన కోతి..ఓనర్, కస్టమర్లు షాక్

విచిత్రమైన సంఘటన..గాయపడిన కోతిమెడికల్ అసిస్టెన్సీకోసం తనంతటతానే మెడికల్ షాపుకు వచ్చింది..కోతికి గాయాలు కనిపించడంతో అక్కడున్న కస్టమర్లు, మెడికల్ షాపు ఓనర్ దానికి ప్రథమ చికిత్సఅందించారు. ఈ ఘటన ఇటీవల బంగాదేశ్ లోని జరిగింది. దీనికి సంబంధించిన హార్ట్ టచ్చింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనుషుల్లా కోతులు కూడా బాగా అప్డేట్ అయ్యాయని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. 

బంగ్లాదేశ్ లోని మెహెర్ పూర్ సిటీలో ఈ వింతైన ఘటన జరింగింది. గాయపడిన  కోతి(కొండముచ్చు) వైద్య సహాయం కోసం ఓ మెడికల్ షాపులోకి వెళ్లింది. అల్హెరా ఫార్మసీ అనే మెడికల్ లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ  కెమెరాల్లో  బందించబడ్డాయి. 

ALSO READ | భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసిన అమెరికా : హమాస్ కు మద్దతుపై ఆరోపణలు : స్వచ్చంధంగా ఇండియాకు

ఆ ఫుటేజ్‌లో ఆ కొండముచ్చు ప్రశాంతంగా కౌంటర్‌పై కూర్చుని ఉండగా మెడికల్ షాపు సిబ్బంది, కస్టమర్లు ప్రాథమిక చికిత్స చేశారు. ఒక వ్యక్తి దాని గాయానికి ఆయిట మెంట్ పూయడం కనిపిస్తుంది. మరొక వ్యక్తి తన చేతులతో కోతిని పట్టుకుని సహాయపడుతున్నట్లు కనిపించింది. తర్వాత గాయపడిన చోట కట్టు చుట్టడం కనిపిస్తుంది. ఇదంతా కొండముచ్చు కదలకుండా ఉండి సహకరించడం అక్కడున్న వారిని, వీడియో చూసిన వారిని చాలా అశ్చర్యానికి గురి చేసింది. 

ఇక ఘటనకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కోతి గాయానికి చికిత్సకోసం సరిగ్గా మెడికల్ షాపుకు వెళ్లిన దాని తెలివితేటలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు దయతో కోతికి చికిత్స చేసిన మెడికల్ సిబ్బంది, కస్టమర్లను అభినందించారు.  

మానవత్వం ఇంకా బతికేఉంది అని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. జంతువులను ప్రేమతో సపర్యలు చేసే వారు వారికి అభినందనలు అంటూ మరికొందరు.. కోతులు కూడా మనుషులతో పాటు అప్డేట్ అవుతున్నాయని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.