Video Viral: ఫార్మసీలో కోతి... వీటి తెలివికి ట్యాక్స్​ విధిస్తారా అని నెటిజన్లు కామెంట్​..

Video Viral: ఫార్మసీలో కోతి... వీటి తెలివికి ట్యాక్స్​ విధిస్తారా అని నెటిజన్లు కామెంట్​..

ప్రపంచంలో సోషల్​ మీడియా రాజ్యం ఏలుతుంది.  ఏ మూల ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో వైరల్​ అవడం.. జనాలు కామెంట్లు చేయడం.. పోస్టులు పెట్టడం సాధరణమైంది.  ఇప్పుడు తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో వైరల్​ కాగా .. నెటిజన్లు.. కోతుల తెలివికి ట్యాక్స్​ విధిస్తారా అంటూ ఫన్నీగా కామెంట్​ చేశారు..

కోతి బుద్దులు... కోతి చేష్టలు అంటారు. కొంతమంది అలాంటి కోతిని హనుమంతుడిగా భావించి పూజలు చేస్తుంటారు.  జనాలకు ఎంత చెప్పినా.. ఎటు వెళ్లాలో తెలియక పోతే అలాంటి వారికి ఎర్ర బస్సెక్కి వచ్చావా అని ప్రశ్నిస్తుంటారు.  కాని ఇప్పడు చెప్పబోయే వార్తలో ఓ కోతి దెబ్బతగిలింది.  ఇక వెంటనే మందు కోసం ఓ మందులషాపులోకి దూరింది.  ఆ షాపు యజమాని మందు వేస్తున్న సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.

వీడియో కనిసిస్తున్న కోతి ఫార్మసీ షాపులోకి వెళ్లి కూర్చుంది.  ఆ కోతి గాయంతో బాధపడుతున్నట్లు గమనించిన  ఆ షాపు యజమాని  గాయమైన కోతికి చికిత్స చేశాడు.  ఓ  చిన్న కోతి నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. కోతికి తగిలిన  గాయానికి లేపనం రాసి, దానికి మెల్లగా కట్టు కట్టారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని మెహెర్‌పూర్‌లో జరిగింది. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో నెటిజన్లు స్పందించారు. అయితే, ఈ వీడియో ఆన్‌లైన్‌లో చాలా మంది హృదయాలను తాకింది.

కొంతమంది కోతి మేధస్సును చూసి ఆనందిస్తూ.. మర్కటాలు చాలా తెలివైనవి.. వీటికి కూడా త్వరలో ట్యాక్స్​ విధిస్తారని ఫన్నీ కామెంట్​ చేశారు.  మరికొంతమంది  మనుషులకు.. జంతు రాజ్యానికి  ఉన్న కరుణ గురించి స్పందించారు.  ఇంకొకరు  జంతువులు దయచూపే వారి దగ్గరకు వెళతాయి.. అలా దేవుడే అలాంటి వారి దగ్గరకు వెళ్లేలా మంచి మార్గంలో నడిపిస్తాడని కామెంట్​  చేశారు.  ఫార్మసీ షాపు వారి ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్​ అంటూ.. అడవి కోతి ప్రమాదకరమైంది.. అయినా సహాయం చేశారు  అని పోస్ట్​ పెట్టారు. కోతులు మనకంటే తెలివైనవి.. అందుకే దెబ్బ తగిలితే  ఫార్మసీ షాపునకు వచ్చిందని చమత్కారంగా రాశాడు. 

సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న కోతికి సంబంధించిన వీడియో బెంగాల్ టైగ్రెస్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో pia.bengaltigress ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు .. ఇది చాలా ముద్దుగా ఉంది. వాళ్ళు అతనితో ఎలా మాట్లాడుతున్నారో నాకు చాలా ఇష్టం... అని క్యాప్షన్ రాశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు ( వార్త రాసే సమయానికి) 810 వీక్షణలు పొందింది.