
జైపూర్: వరుస ఓటములతో డీలా పడ్డ రాజస్తాన్ రాయల్స్‌కు మరో షాక్. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ మరో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. గురువారం ఆర్సీబీతో జరిగే తదుపరి పోరులో శాంసన్ బరిలోకి దిగడం లేదని రాయల్స్ ఫ్రాంచైజీ సోమవారం ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా పక్కటెముకల నొప్పికి గురైన శాంసన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఈ కారణంగానే మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం జైపూర్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్న శాంసన్ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో రాజస్తాన్ మెడికల్ స్టాఫ్ నిర్ణయించలేదు. శాంసన్ గైర్హాజరీలో రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేపట్టగా.. ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ సీజన్‌లో శాంసన్ 7 మ్యాచ్‌ల్లో 224 రన్స్ మాత్రమే చేశాడు. రాయల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.