Kashmir: క్రికెట్ బ్యాట్‌తో దారుణంగా దాడి.. పరిస్థితి విషమం

కాశ్మీర్ లోని నౌగామ్‌లోని మదంఖా ప్రాంతంలో స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బాధాకరమైన సంఘటన జరిగింది. అప్‌టౌన్ శ్రీనగర్‌లోని నౌగామ్ ప్రాంతంలో ఒక వ్యక్తిపై ఇద్దరు క్రికెట్ బ్యాట్‌తో దారుణంగా దాడి చేశారు. గాయపరిచిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం(ఆగస్టు 24) అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురూ ఏదో ఒక అంశంపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోపంతో నిందితులు బాధితుడిని క్రికెట్ బ్యాట్‌తో తీవ్రంగా గాయపరిచారు. 

ALSO READ | Viral Video: తల్లి చేతులు జోడించి వేడుకున్నా వదల్లేదు..కొడుకును గన్తో కాల్చారు

గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యలు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారిని సెక్షన్లు 191(2), 191(3), 126(2), 131, 109 కింద కేసు నమోదయింది. వీరికి జీవిత ఖైదు శిక్ష విధించాలని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.