
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతోందని, గత ఎన్నికల సమయంలో వైసీపీ విజయానికి సహకరించినవాళ్లను పట్టించుకోవడం లేదని క్రైస్తవ మత ప్రచారకుడు, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. నగరంలోని ఒక హోటల్ లో ఆయా సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తుత వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించిన... బీసీలు, ఎస్సీ, ఎస్టీలు.. ముస్లింలు, క్రిష్టియన్లను వైసీపీ పట్టించుకోవట్లేదన్నారు. వీరందరి సమస్యలపై త్వరలోనే సీఎం జగన్ ను కలుస్తానన్నారు. షర్మిల పార్టీ పెట్టాలని ఏపీలోనూ డిమాండ్ ఉందన్నారు బ్రదర్ అనిల్.
ఇవి కూడా చదవండి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్స్
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్