కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీలకు అన్యాయం

కేంద్ర విద్యాసంస్థల్లో ఓబీసీలకు అన్యాయం

కేంద్ర ప్రభుత్వం పరిధిలో  నడిచే  విద్యాసంస్థలైన  ఎన్‌‌‌‌‌‌‌‌ఐటి,  ట్రిపుల్​ ఐటీ,  ఐఐటీ,   జీఎఫ్‌‌‌‌‌‌‌‌టీలలో  57,152 సీట్లకు  జోసా  కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌,  సీసాబ్‌‌‌‌‌‌‌‌  కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా 2023కు నిర్వహించే  సీట్ల కేటాయింపుల్లో  ఓబీసీ విద్యార్థులకు 27% రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం 15,431.04 గాను 14,694 సీట్లను  భర్తీ చేశారు. ఈ లెక్కన 737 సీట్లను 2023-24 విద్యా సంవత్సరంలో  కోత పడింది. ఆయా విద్యాలయాల్లో   కటాఫ్‌‌‌‌‌‌‌‌  దగ్గర  ఉన్న  ర్యాంకుల  విద్యార్థులతో  నింపకుండా మిగిలిపోవటానికి అవకాశం ఇచ్చారు.  దగ్గరగా ఉన్నా మెరిట్‌‌‌‌‌‌‌‌  విద్యార్థులకు  ఇవ్వకపోవడం అనేది  ఓబీసీలకు తీరని అన్యాయం చేసినట్టే అవుతుంది.  

ఓపెన్‌‌‌‌‌‌‌‌ కోటగిరి కింద 50% (23,484), ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ కింద 10% (1,415),  ఎస్టీ కోటా కింద 7.5%(4757),  ఎస్సీ కోటా కింద  15%(8,516), ఓబీసీ కోటా కింద 27% రిజర్వేషన్ల  విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆయా సామాజిక సమీకరణలు, పీడబ్ల్యూడీ,  సూపర్‌‌‌‌‌‌‌‌  న్యూమరరీ  కోటా కింద  మహిళలకు  ఇందులోనే  రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. మొత్తం రిజర్వేషన్లు 59.5%. ఈ లెక్కన  రిజర్వేషన్లు 50% మించరాదు అనే సుప్రీంకోర్టు  నిబంధనకు వ్యతిరేకమైనందున కోత విధించాల్సిన అవసరం వస్తే  ఓబీసీ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌లలోనే  కోత  విధింపుకు  కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో 2,765 పెరిగిన  సీట్లలో 2,018 ఓబీసీ సీట్లు పెరిగాయి.  వీటితోపాటు మహిళా రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ 33% కోటా స్పెషల్‌‌‌‌‌‌‌‌ గానే  అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో  ఓబీసీ మహిళా  కోటాలో  సీట్లను కూడా  ప్రకటించాల్సిన అవసరం ఉంది. 

ఓబీసీలకు మోదీ సర్కారు అన్యాయం                   
         
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి మెరుగైన, ఉన్నతమైన విద్యా విధానాన్ని ఆశించడం  ఓబీసీలకు తగదని మోదీ సర్కారు వైఖరి  చెప్పకనే చెబుతోంది. ఓబీసీలు.. విజ్ఞానవంతులైన శాస్త్రవేత్తలుగా, వివిధ రంగాల్లో నిపుణులుగా ఎదగటాన్ని  హిందూత్వ శక్తులు జీర్ణించుకోవటం లేదనేది ఈ సందర్భంగా అర్థమవుతున్నది. దేశంలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయంపైన  ఓబీసీ ఎంపీలు, మంత్రులు  కేంద్రపెద్దల్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల కాలంలో ఓబీసీలకు ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పేటువంటి ఈ రాజకీయవేత్తలు  ఓబీసీలు విద్యారంగంలో ముందువరసకు రావడానికి జీర్ణించుకోలేకపోవటాన్ని కూడా వ్యతిరేకించకపోవడం అనేది అన్యాయం.  జాతీయ స్థాయిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండాలు,- జెండాలను పక్కనపెట్టి ఓబీసీలకు రిజర్వేషన్ల అన్యాయంపైన కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌  కోటా కింద అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వర్గాల కోసం 10%  రిజర్వేషన్లను  కేటాయించడం కోసం పార్లమెంటులో ఉన్న యావత్‌‌‌‌‌‌‌‌ పార్లమెంటు సభ్యులందరూ మూకుమ్మడిగా అంగీకారాన్ని చెప్పటం అనేది అగ్రకులాలకు వంత పాడటమే అవుతుంది. అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాలు ఎన్నడూ తమకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసిన చరిత్ర లేనేలేదు. 

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలి

పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లను  కేటాయించి బిల్లు పాస్‌‌‌‌‌‌‌‌ చేసి అమలు చేసింది. నిజానికి సామాజికంగా వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీలు మినహాయింపు చేస్తే మిగతా ఏ వర్గాలైనా అదే కోవకు వస్తే  ఓబీసీ కేటగిరీలోనే వారిని కేటాయించింది.  రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా 50% సీలింగ్‌‌‌‌‌‌‌‌ అనే విధానాన్ని అడ్డం పెట్టుకొని ఓబీసీలకు అన్యాయాన్ని చేస్తున్నారు.  ఓబీసీలకు 27% రిజర్వేషన్లు  కేటాయించినప్పటికీ 22, 23 శాతానికి  రిజర్వేషన్లు అమలును  పరిమితం చేస్తున్నవి.  ఓబీసీలు దాదాపు దశాబ్దాల కాలంగా పోరాటాలు చేస్తున్నా.. వీరికి మద్దతుగా పార్లమెంటులో గళమెత్తిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఓబీసీ రిజర్వేషన్లు 27% నుంచి ఎవరి జనాభా ఎంత ఉందో అంతా కేటాయించాలి.  రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయడానికి పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది.  రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సుప్రీంకోర్టు సీలింగ్‌‌‌‌‌‌‌‌ 50 శాతం రిజర్వేషన్లు దాటరాదనే నిబంధనను ఎత్తివేయటానికి సిద్ధమని ప్రచారం చేసింది.  ఓబీసీ నేతగా చెలామణి అవుతున్న ప్రధానమంత్రి మోదీ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాం.

- పాపని నాగరాజు,
జాతీయ అధ్యక్షుడు,
ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్