కురవి(డోర్నకల్), వెలుగు: తొమ్మిదేండ్ల కేసీఆర్ అసమర్థ పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీఎస్పీ స్టేట్చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమన్నారు.
జాబ్రాలేదని గత శుక్రవారం సూసైడ్చేసుకున్న డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమట్టి తండాకు చెందిన భూక్య వినయ్ కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి యుద్ధప్రాతిపదికన టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. వినయ్కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్చేశారు.
నిరుద్యోగులకు ప్రభుత్వం తరఫున ఫ్రీ కోచింగ్ సెంటర్లు నిర్వహించాలన్నారు. భవిష్యత్లో పేపర్ లీకేజీలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని, కేసీఆర్అసమర్థతతోనే గురుకులాల్లో 616 పీఈటీ పోస్టులు భర్తీ కాలేదన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పారు.