ఇన్నోవా హైక్రాస్​ లిమిటెడ్​ ఎడిషన్​ వచ్చేసింది..

టొయోటా తన మల్టీపర్పస్​ వెహికల్ (ఎంపీవీ) ఇన్నోవా హైక్రాస్  లిమిటెడ్​ -ఎడిషన్ వేరియంట్‌‌‌‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.   ధరలు రూ. 20.07 లక్షల నుంచి 20.22 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. కొత్తగా వచ్చిన "ఇన్నోవా హైక్రాస్ జిఎక్స్ లిమిటెడ్ ఎడిషన్" స్టాండర్డ్ జీఎక్స్ ట్రిమ్‌‌‌‌తో పోలిస్తే దీని ధర రూ. 40 వేలు ఎక్కువ. ఇందులోని రెండు లీటర్ల ఇంజన్​ 172 బీహెచ్​పీని, 205 ఎన్​ఎం టార్క్​ను ఇస్తుంది. వచ్చే నెల వరకే ఈ లిమిటెడ్​ఎడిషన్​ ఎంపీవీ అందుబాటులో ఉంటుంది.

ALSO READ : రైతుల ఆనందం కోసమే కేసీఆర్ పథకాలు : మర్రి జనార్దన్ రెడ్డి