మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2023 అక్టోబర్ 14న ఉదయం ఓఆర్ఆర్ పై వేగంగా దసుకొచ్చిన ఇనోవా వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కన నిలిచున్న లారీని వెనుకను నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇనోవా వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కీసర నుండి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను కుత్బుల్లాపూర్ కు చెందిన డ్రైవర్ మారుతి, ప్రయాణికుడు రాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు శామీర్ పేట పోలీసులు పేర్కొన్నారు.